Home సినిమా వార్తలు విశ్వంభర, ఘాటీ రిలీజ్ పై ఉత్కంఠ 

విశ్వంభర, ఘాటీ రిలీజ్ పై ఉత్కంఠ 

tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జులై లో రిలీజ్ అవుతుందని భావించారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ లేట్ కారణంగా మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడింది.

మరోవైపు అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటీ మూవీ కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉండగా దానిని జులై 11కి వాయిదా వేశారు.

అయితే తాజాగా తమ మూవీకి సంబంధించి విఎఫ్ఎక్స్ లేట్ కారణం రీత్యా మరొకసారి వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ తెలిపారు. మొత్తంగా అటు మెగాస్టార్ విశ్వంభర, ఇటు అనుష్క శెట్టి ఘాటీ సినిమాలు రెండూ కూడా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తుడడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ అసలు ఆ మూవీస్ రెండూ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరి పక్కాగా ఈ రెండు మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియాలి అంటే టీమ్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version