Home సినిమా వార్తలు జూనియర్ రివ్యూ : అస్థిరంగా సాగె ఎంటర్టైనర్ మూవీ 

జూనియర్ రివ్యూ : అస్థిరంగా సాగె ఎంటర్టైనర్ మూవీ 

junior review

సినిమా పేరు: జూనియర్

రేటింగ్: 2.25 / 5

తారాగణం: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, సుధార్ణై, అచ్యుత్ కుమార్, రావు రమేష్, మరియు ఇతరులు

దర్శకుడు: రాధాకృష్ణా రెడ్డి

నిర్మాత: రజనీ కొర్రపాటి

విడుదల తేదీ: 18 జూలై 2025

యువ నటుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జూనియర్. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ

ముఖ్యంగా జూనియర్ మూవీ కథలో తన తండ్రి యొక్క హృద్యమైన ప్రేమకథ విని ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యే యువకుడు అభి (కిరీటి) అనంతరం ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడంతో పాటు తన బాస్ తో జరిగే వివాదాలు ఏవిధంగా ఎదుర్కొని ముందుకు సాగాడు అనే పంథాలో కథ, కథనాలు సాగుతాయి. 

నటీనటుల పెర్ఫార్మన్స్

ముఖ్యంగా ఈ మూవీ ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయిన యువకుడు కిరీటి ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా తన ఆకట్టుకునే నటన డ్యాన్స్ తో అందరినీ అలరించాడు. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అతడి పెర్ఫార్మన్స్ మరింతగా హృద్యంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

హీరోయిన్ శ్రీలీల పాత్ర చిన్నదే. అక్కడక్కడా అలా వచ్చి ఇలా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. వైరల్ వయ్యారి సాంగ్ లో కిరీటి, శ్రీలీల డ్యాన్స్ సూపర్ గా ఉంది. నటుడు రవిచంద్రన్ ది అంత డీప్ గా సాగె పాత్ర కానప్పటికీ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆయన చక్కగా పెర్ఫార్మ్ చేసాడు.

ఇక మరొక ముఖ్య పాత్ర చేసిన జెనీలియా పాత్రలో లాజికల్ అపీల్ కనిపించదు. ఇక రావు రమేష్, అచ్యుతరావు పాత్రలు కూడా సగం సగంగానే సాగినట్లు అనిపిస్తుంది. కమెడియన్స్ సత్య, వైవా హర్ష కొంత నవ్వులు పండించారు. 

విశ్లేషణ

దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి ప్రారంభ సన్నివేశాలు బాగానే చిత్రీకరించాడు. సహజ సిద్ధంగా సాగె తండ్రి పాత్ర మొదటి నుండి బాగానే ఆకట్టుకుంటుంది. అనంతరం హీరో కాలేజీలో చేరడం, ఇంట్రో సాంగ్ రావడంతో సినిమా సాగుతుంది.

ఇక అక్కడి నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ వరకు సినిమా సాదాసీదాగా మాత్రమే సాగుతుంది. అయితే హీరో తన జ్ఞాపకాలని గుర్తు చేసుకునే సీన్స్ గత చిత్రాల్లో చూసినవి మాదిరిగానే అనిపిస్తాయి. అయితే చాలావరకు ఇటువంటి సీన్స్ తోనే దర్శకుడు సినిమా ఫస్ట్ హాఫ్ ని నడిపాడు.

అయితే మంచి ఎమోషనల్ నోట్ లో సాగె సెకండ్ హాఫ్ మెల్లగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఆకట్టుకునే రీతిన సాగుతుంది. అక్కడి నుండి తండ్రి యొక్క ప్రేమకథని కొద్దికొద్దిగా అర్ధం చేసుకుని ముందుకు సాగె సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే జెనీలియా కాంబో సీన్స్ అంత ప్రభావం చూపవు.

అలానే అన్ని సినిమాల మాదిరిగా రొటీన్ గా సాగె విలన్ సీన్స్ కథ పై ఆడియన్స్ కి ఎటువంటి కొత్తదనాన్ని అందించవు. అనంతరం ఒక వికారపు ఫన్నీ సీన్ తో గ్రామం లోకి శ్రీలీలని తీసురావడం, అనంతరం వైరల్ వయ్యారి సాంగ్ వస్తుంది. అయితే క్లైమాక్స్ లో తండ్రి తో ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్ బాగున్నప్పటికీ వాటిని ఇంకా హృద్యంగా రాసుకుంటే బాగుండేదనిపిస్తుంది. 

ప్లస్ పాయింట్స్

  • ప్రారంభ సన్నివేశాలు
  • రవిచంద్రన్ పాత్ర మరియు అభినయం
  • కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు 

మైనస్ పాయింట్స్ :

  • బోరింగ్ కథనం
  • మొదటి భాగంలో ఆకట్టుకోని సీన్స్
  • సరైన భావోద్వేగాలు లేకపోవడం
  • గత సినిమాల్లో సీన్స్ రిపీట్

తీర్పు

మొత్తంగా యువ నటుడు కిరీటి రెడ్డి హీరోగా శ్రీలీల హీరోయిన్ గా యువ దర్శకుడు రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన జూనియర్ మూవీ చాలా వరకుఆ ఆకట్టుకోని రీతిన కథ కథనాలతో సాగుతుంది. అయితే హీరో కిరీటితో పాటు నటుడు రవిచంద్రన్ సీన్స్ మధ్య కొన్ని సీన్స్ తో పాటు వారిద్దరి యాక్టింగ్ బాగుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version