పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా హిస్టారికల్ పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా హరిహర వీరమల్లు. ఈ పాన్ ఇండియన్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబి డియోల్, నర్గీస్ పక్రి, అనసూయ భరద్వాజ్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే సాంగ్స్, టీజర్లతో పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అయితే నేడు ఈ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సహా మూవీ టీంలోని కీలక సభ్యులు చూశారు.
ఇక పవన్ కళ్యాణ్ ట్రైలర్ పై ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ అందించారని తప్పకుండా హరిహర వీరమల్లు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచుతుందని టీమ్ ఆశాభావం చేస్తుంది. అలానే సినిమా జులై 24న రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ ఖాయమని మరోవైపు పవన్ ఫ్యాన్స్ కి ఇది మంచి ఐ ఫీస్ట్ ని కూడా అందిస్తుందని టీం చెబుతోంది. మరి వీరమల్లు ఎంతమేర ఆడియన్స్ ని మెప్పిస్తాడో చూడాలి