యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ కలయికలో యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ సంస్థ పై ఆదిత్య చోప్రా గ్రాండ్ గా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ సినిమా వార్ 2. వార్ సీక్వెల్ అయిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో విశేషమైన అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో అందరిలో అంచనాలు మరింతగా పెంచిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే తాజాగా వార్ 2 మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగావంశీ దాదాపుగా రూ. 80 కోట్లకు పైగా భారీ ధరకు స్వంతం చేసుకున్నారు.
మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా రైట్స్ కోసం కూడా ఆయన పోటీపడ్డారు కానీ చివరకు అవి ఏషియన్ సురేష్ సంస్థకు చేరాయి. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన వార్ 2 కచ్చితంగా రిలీజ్ అనంతరం భారీ విజయం ఖాయమని ఇటు ఎన్టీఆర్ తో పాటు అటు హృతిక్ ల నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్ గా చెబుతున్నారు. కాగా ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు.