Home సినిమా వార్తలు Allu Aravind Comments on Charan goes Viral సంచలనం రేపుతోన్న చరణ్ పై అల్లు...

Allu Aravind Comments on Charan goes Viral సంచలనం రేపుతోన్న చరణ్ పై అల్లు అరవింద్ కామెంట్స్

allu aravind

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తాజాగా శంకర్ తెరకెక్కించిన మూవీ గేమ్ ఛేంజర్. భారీ అంచనాలతో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ పై పలువురు విమర్శలు చేయగా తాజాగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ మాత్రం మరింత వైరల్ గా మారాయి. 

​ఇటీవల తండేల్ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు ని ఉద్దేశించి అరవింద్ మాట్లాడుతూ, ఇటీవల ఒక సినిమాని ఎంతో పైకి మరొక సినిమాని ఎంతో లో కి తీసుకెళ్లారని పరోక్షంగా గేమ్ ఛేంజర్ ని ఉద్దేసించి అన్నారు. 

అలానే మరొక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చరణ్ నటించినా ఫస్ట్ మూవీ చిరుత యావరేజ్ గా నిలవడంతో తదుపరి రాజమౌళితో పెద్ద మూవీ నిర్మించి చరణ్ కి భారీ విజయం అందించాలని భావించి అనంతరం మగధీర మూవీ చేసానని అన్నారు. అయితే చిరుత మూవీ అప్పట్లో విజయం అందుకుంది, కానీ అరవింద్ దానిని యావరేజ్ అనడం అలానే పరోక్షంగా చరణ్ ని ఉద్దేశించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version