విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో అందాల నటీమణులు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా ఫ్యామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా అంతకుముందు రిలీజ్ అయిన ఈ మూవీలోని సాంగ్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలోని గోదారి గట్టు మీద సాంగ్ అయితే మరింతగా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ తో ఇంకా చాలా సెంటర్స్ లో మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది.
విషయం ఏమిటంటే ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయిన గోదారి గట్టుమీద సాంగ్ ని నిన్న యూట్యూబ్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ యొక్క లిరికల్ వీడియో 170 మిలియన్ల వ్యస్ సొంతం చేసుకోగా ఈ వీడియో సాంగ్ ఎంత మేర శ్రోతలను ఆకట్టుకుంటుందో చూడాలి.