Home సినిమా వార్తలు Megastar joins Vishwambhara Song hoot ‘విశ్వంభర’ సాంగ్ షూట్ లో జాయిన్ అయిన చిరంజీవి 

Megastar joins Vishwambhara Song hoot ‘విశ్వంభర’ సాంగ్ షూట్ లో జాయిన్ అయిన చిరంజీవి 

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్ర చేస్తున్నారు. 

ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ప్రారంభం నాటి నుండి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి క్రేజ్ కలిగిన విశ్వంభర మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

కాగా లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ మూవీ నుండి ఒక కీలక సాంగ్ యొక్క షూట్ ఇప్పుడు జరుగుతోండగా తాజాగా చిరంజీవి పాల్గొంటున్నారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ మే 9 న విడుదల కానుండగా కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, ఆశ్రిత, రమ్య పసుపులేటి నటిస్తున్నారు. తొలిసారిగా తన అభిమాన మెగాస్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో అన్ని మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అంశాలను మిళితం చేస్తూ దర్శకుడు వశిష్ట దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version