టాలీవుడ్ యువ నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండెల్. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రెండు రోజుల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.
ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది తండేల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దీనిని గీత ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా సెకండ్ డే కూడా మరింతగా కలెక్షన్ అందుకుంది.
మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో మొదటి రోజు కంటే రెండో రోజు మరింతగా టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక మొదటి రోజు ప్రీ బుకింగ్ తో కలిపి 154కె టికెట్స్ బుక్ కాగా రెండో రోజు 226కె టికెట్స్ బుక్ అయ్యాయి. దీన్ని బట్టి రెండో రోజు మొదటి రోజుని బీట్ చేసింది. ఓవరాల్ గా ఈ మూవీ 640కె టికెట్స్ ని బుక్ చేయబడి 1 మిలియన్ టికెట్ సేల్స్ దిశగా కొనసాగుతుంది.
మరోవైపు ఈ సినిమా ఇప్పటికే రూ. 40 కోట్ల గ్రాస్ ని రూ. 20.75 కోట్ల షేర్ ని దక్కించుకుని ప్రీ బిజినెస్ పరంగా 52 శాతం రికవరీ చేసింది. మొత్తంగా ఈ మూవీ రాబోయే రోజుల్లో మరింత మంచి కలెక్షన్ రాబట్టే అటువంటి అవకాశం గట్టిగా కనపడుతుంది.