Home సినిమా వార్తలు ​Pushpa 3 Story not Yet Fixed పుష్ప – 3 కి ఇంకా స్టోరీ...

​Pushpa 3 Story not Yet Fixed పుష్ప – 3 కి ఇంకా స్టోరీ ఫిక్స్ అవ్వలేదు : అల్లు అర్జున్ 

pushpa 3 movie

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా కీలకపాత్రల్లో మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్ నటించారు.

మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచి ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ యొక్క సీక్వెల్ అయిన పుష్ప 3 పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా జరిగిన పుష్ప 2 యొక్క సక్సెస్ మీట్ లో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పుష్ప 3 కి సంబంధించి కథ నాకు తెలియదు ఇంకా సుకుమార్ గారు స్టోరీ కూడా సిద్ధం చేయలేదు. అయితే నేను మాత్రం ఎప్పుడు చెప్తే అప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు.

కాగా పుష్ప 3 మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని చెప్పాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక మూవీ చేస్తున్న అల్లు అర్జున్ అనంతరం లైన్లో సందీప్ రెడ్డి వంగా మూవీని కూడా అనౌన్స్ చేసారు. మరి పక్కాగా పుష్ప 3 మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు అల్లాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version