Home సినిమా వార్తలు Shiva Shiva Sankara Song Promo Released from Kannappa ‘కన్నప్ప’ : ‘శివ శివ...

Shiva Shiva Sankara Song Promo Released from Kannappa ‘కన్నప్ప’ : ‘శివ శివ శంకర’ సాంగ్ ప్రోమో రిలీజ్ 

kannappa

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా మూవీ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నాయి. 

ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ అయిన ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని కన్నప్ప మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

విషయం ఏమిటంటే ఈ మూవీ నుండి శివ శివ శంకర అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోని నేడు కొద్దసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఆకట్టుకునే మ్యూజిక్ తో సాగిన ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని విజయ్ ప్రకాష్ పాడారు, కాగా ఫుల్ సాంగ్ ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నారు. 

కాగా అన్ని కార్యక్రమాలు ముగించుకుని కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version