Home సినిమా వార్తలు Kanchana 4 with Pan Indian Range పాన్ ఇండియన్ రేంజ్ లో  గ్రాండియర్ గా ‘కాంచన...

Kanchana 4 with Pan Indian Range పాన్ ఇండియన్ రేంజ్ లో  గ్రాండియర్ గా ‘కాంచన 4’ 

kanchana 4

నటుడు కం దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా కూడా ఆకట్టుకుంటూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రుడు సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన లారెన్స్, తాజాగా లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో రూపొందుతోన్న బులెట్ తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. 

కాగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ సిరీస్ మూవీస్ అయిన కాంచన మూవీస్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఆ సిరీస్ లో కాంచన 4 మూవీ తెరకెక్కిస్తున్నారు లారెన్స్, అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఆయనే ప్రధాన పాత్ర చేస్తున్నారు. 

ఇటీవల ఈ మూవీ విషయమై నిర్మాత మాట్లాడుతూ, దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో రూపొందించి రిలీజ్ చేయనున్నాం అని, అలానే కాంచన 4 ఓటిటి కూడా మూవీ రిలీజ్ అయిన 8 వారాల అనంతరమే వస్తుందని తెలిపారు. మరోవైపు ఈ మూవీ హిందీ లో కూడా రిలీజ్ కానుండడంతో అక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నోరా ఫతేహి మరొక కీలక పాత్ర చేస్తున్న కాంచన 4 గురించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version