కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా అందాల కథానాయిక త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పట్టుదల. తమిళ్ లో విడాముయార్చి టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మించారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అర్జున్ సర్జా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవానికి ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ పై పెద్దగా బజ్ లేదు, మరోవైపు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయలేదు.
ఇక ఇప్పటికే తమిళ్ బుకింగ్స్ అయితే బాగానే రెస్పాన్స్ అందుకుంటూ ఉండగా తెలుగు బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. తెలుగులో ఈ మూవీ అసలు రిలీజ్ అవుతుంది అనేది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. మరి ఫిబ్రవరి 6న అనగా రేపు ఆడియన్స్ ముందుకి రానున్న పట్టుదల ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.