మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్, వ్రిద్ధి సినిమాస్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో యువనిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పెద్ది.
ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ యొక్క టీజర్ ని ఏప్రిల్ 6న శ్రీరామనవమి కనుకగా రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ టీజర్ ని ఆరోజున ఉదయం 11:45 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతంగా ఈ గ్లింప్స్ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారని దర్శకుడు బుచ్చిబాబు సన రెహమాన్ తో కలిసి దిగిన ఒక పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు.
ఇక ఈ మూవీ రామ్ చరణ్ ఫాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరిస్తుందని తప్పకుండా రిలీజ్ అనంతరం పెద్ది పెద్ద విజయం ఖాయమని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా టీజర్ లో మూవీ యొక్క రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.