అజిత్ కుమార్ హీరోగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఉషా ఉతుప్, రాహుల్ దేవ్, రోడీస్ రఘు, ప్రదీప్ కబ్రా, హ్యారీ జోష్, కెజిఎఫ్ అవినాష్, యోగి బాబు, ప్రసన్న, ప్రభు, ప్రియా ప్రకాష్, సిమ్రాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ముఖ్యంగా ట్రైలర్ లో అజిత్ మార్క్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వంటివి బాగున్నప్పటికీ ఎక్కువగా ఎలివేషన్ యాక్షన్ సీన్స్ తప్ప స్టోరీని అంతగా చూపించలేదు.
ఇక జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొదటి 30 సెకండ్స్ మాత్రమే బాగుండగా మిగతాది మొత్తం కూడా ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఓవరాల్ గా ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది. అజిత్ ఫ్యాన్స్ బాగుందని చెప్తున్నప్పటికీ సాధారణ ఆడియన్స్ ట్రైలర్ చూసి పెదవి విరుస్తున్నారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.