సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. ఈ మూవీలో అందాల కథానాయిక శృతిహాసన్, మలయాళ నటుడు సౌబిన్ షహిర్ మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలిసారిగా తన అభిమాన సూపర్ స్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో కథ, కథనాల విషయంలో దర్శకుడు లోకేష్ ఎంతో జాగ్రత్త తీసుకుని కూలీ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టీమ్ చెప్తోంది.
ఇప్పటికే కూలీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ టీజర్, ఫస్ట్ సాంగ్ యావరేజ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ మూవీని ఆగస్టు 14న స్వతంత్ర దినోత్సవం కానుకగా గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోంది.
అయితే అదే రోజున సరిగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 కూడా రిలీజ్ కానుంది. మరి బాక్సాఫీస్ పరంగా వార్ 2, కూలీ సినిమాలు రెండూ ఏ స్థాయిలో ఢీ అంటే ఢీ అంటాయో, వీటిలో ఏది ఏ స్థాయి విజయవంతం అవుతుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.