Home సినిమా వార్తలు మోలీవుడ్ లో సంచలన రికార్డు కొట్టిన ‘ఎంపురాన్’

మోలీవుడ్ లో సంచలన రికార్డు కొట్టిన ‘ఎంపురాన్’

empuraan

మోహన్ లాల్  హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్. ఈ మూవీలో మంజు వారియర్, అభిమన్యు సింగ్ తో పాటు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర చేసారు. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎంపురాన్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. 

వాస్తవానికి ఊహలకు మించి రూపొందని ఈ మూవీపై కొందరు ఆడియన్స్ పెదవి విరవగా టాక్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ మూవీ బాగానే కలెక్షన్ తో కొనసాగుతోంది. ఐతే తెలుగులో మాత్రం ఎంపురాన్ ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఇక ఈ మూవీ తాజాగా మొత్తం మోలీవుడ్ సినిమా పరిశ్రమలోనే అతి పెద్ద సంచలన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ మూవీ 8 రోజుల్లో రూ. 235 కోట్ల గ్రాస్ ని అలానే రూ. 100 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. 

వాస్తవానికి అంతకముందు వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ మూవీ రూ. 240 కోట్ల గ్రాస్ అందుకున్నప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్ల పర్సెంటేజ్ కారణంగా రూ. 100 కోట్లని అందుకోలేకపోయింది. కాగా ఆ విధంగా ఎంపురాన్ ఈ రికార్డు సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది. ఇక కేరళ తో పాటు ఓవర్సీస్ లోని పలు ప్రాంతాల్లో ఇంకా ఎంపురాన్ కి మంచి కలెక్షన్ లభిస్తోంది. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version