కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ అటు హీరోగా ఇటు దర్శకుడిగా మంచి జోరుమీద ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇటీవల సార్, కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయాలు సొంతం చేసుకున్నారు ధనుష్. ఇక తన కెరీర్ లో ఎప్పటికప్పుడు విభిన్న తరహా సినిమాలతో ముందుకు సాగే ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీ చేస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. దీనిని జూన్ 20న విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు తాను హీరోగా నటిస్తూ స్వయంగా ధనుష్ తెరకెక్కిస్తున్న మూవీ ఇడ్లీ కడై. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా వుండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
విషయం ఏమిటంటే, ఈ మూవీని అక్టోబర్ 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ నటుడిగా దర్శకుడిగా ధనుష్ కి మరొక మంచి విజయం అందించడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జివి ప్రకాష్ దీనికి సంగీతం అందిస్తున్నారు.