మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస సక్సెస్లతో మంచి క్రేజ్ మార్కెట్ వాల్యూతో కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన హీరోగా తెలుగులో తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్.
యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన థ్రిల్లింగ్ యాక్షన్ సినిమా లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సర్వదమన్ బెనర్జీ, రాంకి, టీంను ఆనంద్, గాయత్రీ భార్గవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్ రిలీజ్ అనంతరం ఓటిటిలో కూడా లక్కీ భాస్కర్ మూవీ సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
అయితే విషయం ఏమిటంటే లక్కీ భాస్కర్ సినిమా మొత్తంగా 14 వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లిస్ట్ లో నిలవడం విశేషం. అనగా 100 రోజులుగా ఇది ట్రెండింగ్ లో కొనసాగుతూ రికార్డు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా అందర్నీ అలరించాయి.
తాజాగా 19 మిలియన్ వ్యూస్ తో అత్యధిక మంది వ్యూవర్స్ చూసిన టాప్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది లక్కీ భాస్కర్. ఈ విధంగా అటు థియేటర్స్ లో ఇటు ఓటిటిలో కూడా రికార్డ్స్ లో దూసుకెళ్తోంది ఈ మూవీ