హిందీ సినిమా పరిశ్రమలో తాజాగా విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలయికలో లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ భారీ యాక్షన్ సినిమా ఛావా. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ గ్రాండ్ ఇయర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ లో భారీ కలెక్షన్ తో దూసుకెళుతోంది.
ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ చత్రపతి శంభాజీ మహారాజ్ గా కనబరిచిన అద్భుత నటనతో పాటు దర్శకుడు లక్ష్మణ్ తెరకెక్కించిన ఆకట్టుకునే కథ, కథనాలు, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవర్ఫుల్ విజువల్స్ వంటివి ఈ సినిమా యొక్క సక్సెస్ కు ప్రధాన కారణాలు చెప్పవచ్చు. ఇక ఈ మూవీని నేడు తెలుగులో గ్రాండ్ గా గీత ఆర్ట్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది.
తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి అందరి నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే అందుకోలేదు, పైగా తెలుగు డబ్బింగ్ పై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కాగా తెలుగులో ఫస్ట్ డే ఛావా మంచి టాక్ అయితే అందుకుంది.
కాగా విషయం ఏమిటంటే ఇప్పటికే హిందీ వర్షన్ ఆల్మోస్ట్ రూ. 500 కోట్లకి పైగా కలెక్షన్ తో కొనసాగుతున్న ఛావా మూవీ ఏప్రిల్ 11న ప్రముఖ ఓటిటి మద్యం నెట్ ఫ్లిక్స్ ద్వారా పాన్ ఇండియన్ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ఓవైపు థియేటర్స్ లో అదరగొడుతూ కొనసాగుతూ ఉండటంతో పాటు రేపు ఓటీటీ రిలీజ్ అనంతరం కూడా అందరిని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.