Home సినిమా వార్తలు Game Changer Detailed Overview Explanation ​’గేమ్ ఛేంజర్’ :డిటైల్డ్ ఫైనల్ ఓవర్ వ్యూ 

Game Changer Detailed Overview Explanation ​’గేమ్ ఛేంజర్’ :డిటైల్డ్ ఫైనల్ ఓవర్ వ్యూ 

game changer

Game Changer Movie Announcement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇటీవల శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఇక ఈమూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈమూవీ యొక్క పూర్తి ఫైనల్ ఓవర్ వ్యూ ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ సినిమాని దిల్ రాజు తొలిసారిగా రామ్ చరణ్, శంకర్ లతో కల్సి చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతకుముందు లైకా ప్రొడక్షన్స్ వారితో శంకర్ ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు. 

అనంతరం బడ్జెట్ విషయంలో కొద్దిపాటి సమస్యలు రావడం ఆపైన కోర్టుకు ఎక్కటంతో ఆ సినిమా పక్కన పెట్టబడింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు చెప్పిన ఒక స్టోరీ లైన్ తో దిల్ రాజును కలుసుకున్నారు శంకర్. నిజానికి ఆయన అనుకున్న సినిమాకి పవన్ కళ్యాణ్ హీరోగా తీసుకుందామని భావించారు. అయితే పవన్ అప్పటికే పొలిటికల్ గా బిజీగా ఉండటంతో రామ్ చరణ్ తీసుకోవడం జరిగింది. అనంతరం రామ్ చరణ్ ని దిల్ రాజు మరియు శంకర్ కలిసి కథ కథనాలు వివరించడం, ఆపైన ఫైనల్ గా ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవడం జరిగింది. 

Game Changer Pre Production Work

ఇక గేమ్ చేంజర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడుకుంటే అప్పటికే పాన్ ఇండియన్ జోన్ లో భారీ క్రేజ్ కలిగిన శంకర్ ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయుడు, జెంటిల్మెన్ వంటి సినిమాలతో తన క్రేజ్ ని నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమా కోసం దిల్ రాజు రూ. 300 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించారు. ఆయన నిర్మాణ సంస్థలో ఇది 50వ సినిమా. ఇక 12 ఫిబ్రవరి 2021 న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా అక్టోబర్ 2021లో దీని షూటింగ్ మొదలుపెట్టి 2023 ప్రథమార్గంలో రిలీజ్ చేయాలని భావించారు. 

అయితే అప్పటికే కమల్ తో శంకర్ చేస్తున్న ఇండియన్ 2 మూవీ షూట్ కారణంగా గేమ్ చేంజర్ షూట్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు విక్రమ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ అయిన రెడీ జెయింట్ మూవీస్ వారు ఇండియన్ 2 కి సంబంధించి ఉన్న ఆర్ధిక సమస్యలను లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి చర్చించి ఇష్యూస్ క్లియర్ చేసి ఫైనల్ గా సినిమా బ్యాలెన్స్ షూట్ ని పట్టాలెక్కించారు. అనంతరం ఇండియన్ 2 మూవీ బ్యాలెన్స్ షూటింగ్ వేగంగానే సాగింది. ఆ తర్వాత షూటింగ్  పూర్తయిన అనంతరం ఇండియన్ 2 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

Indian 2 Disaster : Dil Raju High Budget Misstep

దానితో గేమ్ ఛేంజర్ పై కొందరిలో ఆశించిన స్థాయి అంచనాలు అయితే లేవని చెప్పాలి. మరోవైపు ఇండియన్ 2 పరాజయంతో పాటు అంతకుముందు కూడా శంకర్ ఫామ్ లో లేకపోవడం దీనికి కారణాలు. ఆ విధంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ పడుతూ ఆగస్టు 2021 నుంచి ప్రారంభించబడి చివరకు గత ఏడాది చివర్లో ముగిసి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అనంతరం ఇండియన్ 2 ఎఫెక్ట్ అయితే గేమ్ చేంజింగ్ మీద పడటం అలానే సినిమాలో కూడా ఆశించిన స్థాయి అంశాలు లేకపోవడంతో ప్రీమియర్స్ నుంచి ఈ మూవీకి భారీగా నెగటివ్ టాక్ వచ్చింది. 

ఓవరాల్ గా ఆ మూవీకి బడ్జెట్ అయితే రూ. 300 నుంచి 400 కోట్లకు పెరిగి మొత్తంగా డిజాస్టర్ గా అయితే నిలిచింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా ఈ సినిమా రన్ టైమ్ ని టోటల్ ఫుటేజ్ టైం 5 గంటల నుండి నిర్మాత దిల్ రాజు చొరవతో ఎడిటర్ ప్రక్కనే ఉండి దర్శకుడు శంకర్ 165 నుంచి 170 నిమిషాలకు కుదించారు. కాగా కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాలో శంకర్ మార్క్ సన్నివేశాలు మిస్ అయ్యాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Game Changer Post Production, Release Hype

దానితో రిలీజ్ కి ముందు నుండి ఆశించిన స్థాయిలో హైప్ లేకపోవడం దీని పరాజయానికి మరొక కారణం. ఓవైపు రాంచరణ్ మరోవైపు శంకర్ ఇంకోవైపు దిల్ రాజు అలానే వేరొకవైపు కియారా అద్వానీ వంటివారు ఉన్నప్పటికీ కూడా వారు సినిమాకి ఆశించిన స్థాయి ప్లస్ అందించలేకపోయారు. ఈ మూవీలో థమన్ అందించిన సాంగ్స్ ఆకట్టుకోకపోవడం కూడా ప్రీ రిలీజ్ బజ్ ఏర్పరచకపోవడానికి ప్రధాన కారణం. ఇక ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 200 కోట్లు జరుపుకోగా మొత్తం నాన్ థియేట్రికల్ సహా అన్నీ కలుపుకొని రూ. 350 కోట్లు బిజినెస్ చేసింది. కాగా దీని బడ్జెట్ 400 కోట్లకు పైగా అయింది, ఇక రిలీజ్ అనంతరం సినిమా రూ. 100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి డిజాస్టర్ గా గెలిచింది.

Game Changer Review

ఈ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా సాగే సినిమాలోని కీలకపాత్రల్లో అప్పన్న పాత్ర చాలావరకు పేరు తీసుకొచ్చింది. అయితే ఆ పాత్రని మరింతగా ఎలివేట్ చేసి ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ చేసి ఉంటే సినిమాకు కొంత ప్లస్ అయ్యేదేమో. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన గేమ్ చేజర్ మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లు కూడా బాగున్నప్పటికీ సెకండాఫ్ అయితే సాగుతున్న కొద్ది ఏమాత్రం ఆసక్తి లేకుండా కథనం నడుస్తుంది. క్లైమాక్స్ మరింత నిరాసక్తతతో సాగుతుంది. మొత్తంగా స్టార్ డైరెక్టర్ శంకర్ మొదటి నుండి ఇది అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా అని చెప్పినప్పటికీ కేవలం ఆయన మార్క్ టేకింగ్ సెకండ్ హాఫ్ లోని ఫ్లాష్ బ్యాక్ పార్ట్స్ లో మాత్రమే కనిపిస్తుంది. 

Game Changer Boxoffice Collection & Final Verdict

ఇక గేమ్ చేంజర్ బాక్సాఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే మొత్తం రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా పెద్దగా హైప్ లేకుండానే రిలీజ్ అయింది. ముఖ్యంగా ప్రీమియర్స్ నుంచి భారీ డిజాస్టర్ టాక్ తో పాటు సినిమాకి నెగవిట్ రివ్యూలు, రేటింగ్స్ దెబ్బేసాయి. మరోవైపు తెలుగులో ఈ సినిమా రూ. 150 కోట్లు హిందీలో రూ. 35 కోట్లు అలాగే తమిళంలో  రూ.10 కోట్లు మొత్తంగా కలుపుకొని 195 కోట్లు అనగా ఓవరాల్ బిజినెస్ లో 43 శాతం మాత్రమే ఇది రికవర్ చేసింది. నిజానికి గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అవడం అనేది హీరోగా రాంచరణ్ స్టార్డం కి ఏమాత్రం ఇబ్బంది కాదు. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీతో తనని తాను నటుడిగా నిరూపించుకుని పాన్ ఇండియన్ రేంజ్ లో స్టార్ గా విశేషమైన క్రేజ్ అందుకున్నారు రాంచరణ్. 

ఈ విధంగా దీనికి నెగెటివిటీ వచ్చినప్పటికీ చాలావరకు కూడా చరణ్ స్టార్డం ఈ సినిమాకి ప్లస్ అయింది. అలానే ఈ టాక్ తో రూ. 200 కోట్ల వరకు పెర్ఫార్మన్స్ చేయడం ఈజీ కాదు. మొత్తంగా భారీ లాస్ వచ్చినప్పటికీ ఈ మాత్రం కలెక్షన్ రావటానికి చరణ్ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెప్పాలి. మొత్తంగా గేమ్ చేంజ్ భారీ స్థాయిలో తెరకెక్కి అత్యంత గ్రాండ్ గా రూపొందినప్పటికీ కూడా కథ కథనాల్లో భారీ లోపాలు ఉండటం అలానే స్టార్ కాస్ట్ ని సరిగ్గా దర్శకుడు శంకర్ వినియోగించుకోకపోవడం, కథనం మొత్తం మూస పద్ధతిలో సాగడం, తమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోకపోవడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, అలానే అప్పన్న పాత మాత్రమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇక ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి మద్యం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓటిటి లో కూడా గేమ్ ఛేంజర్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version