పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తాజాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తీస్తున్న మూవీ హరి హర వీర మల్లు. మొత్తంగా రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ ఆకట్టుకోగా ఇటీవల ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. అవన్నీ కూడా పర్వాలేదనిపించాయి. నేడు మూవీ నుండి కొల్లగొట్టినాదిరో అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
పవన్ కళ్యాణ్ తో కలిసి పూజిత పొన్నాడ, అనసూయ చిందేసిన ఈ లిరికల్ సాంగ్ ని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఆలపించగా చంద్రబోస్ రచించారు. కీరవాణి ఈ సాంగ్ కి మంచి ట్యూన్ అందించారు. ఈ డాన్సింగ్ ట్యూన్ కి తగ్గట్లుగా సెట్టింగ్, డ్యాన్స్ లు కూడా బాగానే కుదిరాయి.
మొత్తంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ రేపు థియేటర్స్ లో ఆడియన్స్ మనసు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని ఏ ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.