పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం కృష్ జాగర్లమూడి అలానే జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న సినిమా హరిహర వీరమల్లు పార్ట్ 1. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రల్లో బాబి డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న హరి హర వీర మల్లు నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సాంగ్ పరవాలేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి కొల్లగొట్టినాదిరో అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో పూజిత పొన్నాడ, అనసూయలతో పాటు పవన్ కళ్యాణ్ ని చూడవచ్చు. ఈ పవర్ఫుల్ పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమోకి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక హరిహర వీరమల్లో మూవీ మార్చి 28న సమ్మర్ కానుకగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి