Home బాక్సాఫీస్ వార్తలు Chhaava First Week Boxoffice Collections ‘ఛావా’ మొదటి వారం బాక్సాఫీస్ కలెక్షన్

Chhaava First Week Boxoffice Collections ‘ఛావా’ మొదటి వారం బాక్సాఫీస్ కలెక్షన్

chhaava

తాజాగా బాలీవుడ్ లో ఛావా మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టే కలెక్షన్స్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక మందన్నల కలయికలో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ అందర్నీ ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుత యాక్టింగ్ తో పాటు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

Chhaava Boxoffice Collections

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ఆయన కుమారుడైన చత్రపతి శంభాజీ మహారాజ్, ఔరంగాజేబును ఎదిరించి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాన్ని తీసుకుని ఈ సినిమా రూపొందింది. ఇక మొదటివారం ఛావామూవీ రూ. 200 కోట్ల నెట్ కలెక్షన్ అయితే సొంతం చేసుకుంది. 

మొత్తంగా ఈ సినిమా రూ. 245 కోట్ల గ్రాస్ ని అందుకోవటం జరిగింది. మరోవైపు ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ అందుకుని వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 290 కోట్లు సొంతం చేసుకుంది. దీని తాజా కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఓవరాల్ గా ఈ మూవీ రూ. 500 కోట్ల గ్రాస్ ని అలానే ఇండియాలో రూ. 400 కోట్ల నెట్ అందుకునే అవకాశం కనబడుతోంది ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని గ్రాండ్ గా నిర్మించింది. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version