2023లో నవీన్ పోలిశెట్టి హీరోగా మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు అనుష్క శెట్టి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో విక్రమ్ ప్రభు మరొక కీలకపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ఘాటి.
ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచిన ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ పవర్ ఫుల్ గా అందర్నీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఈ మూవీని పాన్ ఇండియన్ భాషల్లో యూవి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాని వాస్తవానికి ఏప్రిల్ 18 రిలీజ్ చేయాలని భావించారు అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యం కానుండడంతో రిలీజ్ మరొక రెండు నెలలు వాయిదా పడేటువంటి అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలో ఘాటి న్యూ రిలీజ్ డేట్ కి సంబంధించి మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది. కాగా ఈ మూవీలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు అనుష్క శెట్టి