Home సినిమా వార్తలు Lucky Bhaskar All Time Record in Netflix లక్కీ భాస్కర్ : నెట్ ఫ్లిక్స్...

Lucky Bhaskar All Time Record in Netflix లక్కీ భాస్కర్ : నెట్ ఫ్లిక్స్ లో ఆల్ టైం రికార్డు

lucky bhaskar

ఇటీవల మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ సినిమాని వెంకీ అట్లూరి తెరకెక్కించారు. 

జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం అతిపెద్ద విజయం అయితే అందుకుంది. ఇక కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. 

కాగా విషయం ఏమిటంటే 13 వారాలుగా ఓటిటి లో లక్కీ భాస్కర్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. ముఖ్యంగా అన్ని భాషల ఆడియన్స్ ఈ మూవీని ఎంతో ఆదరిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఆ విధంగా 13 వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగిన సౌత్ ఇండియన్ మూవీగా లక్కీ భాస్కర్ ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. 

మరోవైపు కలెక్షన్ల పరంగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నటుడిగా దుల్కర్ సల్మాన్ యొక్క ఇమేజ్ ని మరింత పెంచేసింది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version