ఇటీవల కేజీఎఫ్ సిరీస్ సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు ఒక దానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకున్నాయి.
ముఖ్యంగా కేజీఎఫ్ 2 అయితే బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకుని మార్కెట్, క్రేజ్ పరంగా హీరో యష్ ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది. దాని అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న యష్, తాజాగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ సినిమా టాక్సిక్. ఈ సినిమాలో కరీనాకపూర్ కీలకపాత్ర చేస్తుండగా ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. అయితే విషయం ఏమిటంటే కొన్నాళ్ళుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అటు ఇంగ్లీష్ వర్షన్ లో కూడా షూట్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
మన భారతీయ పాన్ ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ మరియు ఇతర ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని ఆ విధంగా ఈ సినిమా ద్వారా టాక్సిక్ మూవీని ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు గ్లోబల్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.