Home సినిమా వార్తలు Trolls on Megastar Chiranjeevi మెగాస్టార్ పై ఆగని ట్రోల్స్

Trolls on Megastar Chiranjeevi మెగాస్టార్ పై ఆగని ట్రోల్స్

megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తాజాగా బ్రహ్మానందం మరియు ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు చేస్తున్న బ్రహ్మ ఆనందం మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిన్న ప్రత్యేక అతిధిగా విచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ మీడియాని సైతం ఊపేస్తున్నాయి. ఇక చిరంజీవి తన తాతయ్య గురించి మాట్లాడుతూ, ఆయన మంచి రసికుడని అన్నారు.

అలానే ఆయనకు ఒకరిద్దరు కాదు ముగ్గురు నలుగురు భార్యలున్నట్లు చెప్పారు మెగాస్టార్. ఇక తమ ఇల్లు మొత్తం లేడీస్ హాస్టల్ మాదిరిగా ఉందని, చరణ్ కి కూడా ఇటీవల అమ్మాయి పుట్టడంతో తదుపరి చరణ్, ఉపాసన దంపతులని అబ్బాయి కావాలని కోరానని, అప్పుడే మన వంశం నిలబడుతుందని చెప్పినట్లు తెలిపారు.

మొత్తంగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల పై పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ సమాజంలో మగ అయితే ఏంటి ఆడ అయితే ఏంటి, ఇద్దరూ సమానమే కదా, చిరంజీవి వంటి ఉన్నత స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదనేది కొందరి వాదన.

మరోవైపు మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యల పై  బహిరంగంగానే విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల అంశం ఇక పై ఏవిధమైన మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version