టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ ఫస్ట్ డే బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఫస్ట్ డే దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా ఫేక్ చేసి పోస్టర్ రిలీజ్ చేయడంతో నేషనల్ వైడ్ గా దాని పై విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు శంకర్ మార్క్ టేకింగ్ అసలు మూవీలో కనిపించలేదు సరికదా, పాత మూస పద్దతిలో సాగిన కథ, కథనాలు మూవీకి బాగా దెబ్బేసింది. ఇక సాంగ్స్ కూడా అంతగా ఆదరణ అందుకోకపోవడం, బిజీఎం కూడా పెద్దగా అలరించకపోవడం మైనస్.
వీటన్నిటి తోపాటు సరిగ్గా సంక్రాంతి క్లాష్ కి వచ్చిన డాకు మహారాజ్ బాగానే ఆకట్టుకోగా సంక్రాంతికి వస్తున్నాం పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్స్ మొత్తం మెజారిటీ తన ఖాతాలో వేసుకుంది. ఇవన్నీ చాలానట్టు తాజాగా మూవీ ఫెయిల్యూర్ విషయమై డైరెక్ట్ గానే పలువురు సినిమా వారు హీరో చరణ్ తో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు లని టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా అన్ని విధాలుగా గేమ్ చేంజర్ చాలా పెద్ద దెబ్బని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి రానున్న RC 16 మూవీతో చరణ్ ఎంతమేర విజయం అందుకుంటాడో చూడాలి.