టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ కూడా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ అంతా గోప్యంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణి కూడా కొన్ని ట్యూన్స్ సమకూర్చారట.
కేఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం ఆయన బల్క్ గా బాడీని పెంచడంతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం కూడా పెంచుతున్నారు.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారని అలానే ఆయన ఇందులో మహేష్ బాబుకు తండ్రిగా కనిపించనున్నారని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు, అలానే ఆమె నెగిటివ్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఒక గ్లింప్స్ ని రెడీ చేసిన జక్కన్న రాజమౌళి, సమ్మర్లో దాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు టాక్.