యువ నటుడు విశ్వక్సేన్ తాజాగా నటించిన సినిమా లైలా. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ కొంత భాగం లేడీ గెటప్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇటువంటి ఛాలెంజింగ్ పాత్రలో తన మార్కు పెర్ఫార్మన్స్ తో అందరిని అలరించారు విశ్వక్సేన్.
మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన లైలా సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అనంతరం చతికలబడింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు పలు సెక్షనాఫ్ ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు నటుడిగా విశ్వక్సేన్ ఆకట్టుకున్నప్పటికీ కథాకథనాలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ సినిమా యొక్క పరాజయానికి ప్రధాన కారణం.
అయితే మ్యాటర్ ఏమిటంటే లైలా సినిమా మార్చి 7న ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరోవైపు ఈ సినిమా ఓటిటిలో తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మూవీ టీం. మరోవైపు మార్చి 7న నాగచైతన్య, సాయి పల్లవి ల తండేల్ కూడా ఓటీటి ఆడియన్స్ ముందుకు వచ్చింది.
ఇక లైలా డిజాస్టర్ తర్వాత నటుడిగా ఇకపై అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాల్లో నటిస్తానని అలానే ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు తన సినిమాలో లేకుండా చూసుకుంటానని ఇటీవల ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశారు విశ్వక్సేన్. త్వరలో అనుదీప్ కేవి దర్శకత్వంలో కయదు లోహర్ హీరోయిన్ గా విశ్వక్ ఒక సినిమా చేయనున్నారు.