Home సినిమా వార్తలు ‘హరి హర వీర మల్లు’ న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

‘హరి హర వీర మల్లు’ న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

hari hara veera mallu

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి అలానే జ్యోతి కృష్ణ ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్నారు. 

రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదాపడిన ఈ సినిమా యొక్క తాజా రిలీజ్ డేట్ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దాని ప్రకారం ఈ మూవీ జూన్ 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సిద్దమవుతోందట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

కీరవాణి స్వరపరిచిన ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బాగానే రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా అనంతరం త్వరలో ఓజి తోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొనేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు రిలీజ్ అనంతరం ఆయనకు ఏస్థాయి విజయాన్నందిస్తాయో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version