బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల లాల్ సింగ్ చెడ్డా సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అందులో నాగచైతన్య కూడా ఒక కీలకపాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమా సితారే జమీన్ పర్. ఈ సినిమా స్పానిష్ మూవీ క్యాంపియన్స్ కి అఫీషియల్ రీమేక్. ఇక ఈ సినిమాని జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో అమీర్ ఖాన్ బాస్కెట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. కథా పరంగా కొందరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుర్రాళ్ళకి ట్రైనర్ గా ఆయన కనిపించనున్నారు.
జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అమీర్ ఖాన్ తన సొంత సంస్థ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతమవుతుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
విషయం ఏమిటంటే సితారే జమీన్ పర్ నుంచి తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా ఈ సినిమా ద్వారా తమ అభిమాన నటుడు అమీర్ ఖాన్ పెద్ద విజయం అందుకోవటం ఖాయమని ఆయన అభిమానులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 20న గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సితారే జమీన్ పర్ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.