Home సినిమా వార్తలు ‘కింగ్‌డ‌మ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ 

‘కింగ్‌డ‌మ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ 

kingdom

టాలీవుడ్ యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ కింగ్‌డ‌మ్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ క్రేజీ ప్రాజక్ట్ మే 30న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్ర చేస్తున్న ఈమూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది.

విషయం ఏమిటంటే, తమ మూవీ నుండి ఈ వారంలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం నిర్మాత నాగవంశీ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనిరుద్ ఈ మూవీకి అందించే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై అందరిలో మంచి ఆసక్తి నెలకొని ఉంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version