Home సినిమా వార్తలు ‘దేవర’ ఫస్ట్ వీకెండ్ జపాన్ కలెక్షన్ డీటెయిల్స్

‘దేవర’ ఫస్ట్ వీకెండ్ జపాన్ కలెక్షన్ డీటెయిల్స్

devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. 

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ రిలీజ్ అనంతరం బాగా సక్సెస్ అయింది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్, అజయ్, గెటప్ శ్రీను, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ మార్చి 28న జపాన్ లో రిలీజ్ అయింది. 

ఇక ఎన్టీఆర్ కి జపాన్ లో బాగా క్రేజ్ ఉంది. కొద్దిరోజుల క్రితం జపాన్ కి ఎన్టీఆర్, కొరటాల శివ చేరుకొని అక్కడ కూడా తమ మూవీని బాగా ప్రమోట్ చేసారు. ఇక లేటెస్ట్ గా అక్కడ కూడా దేవర పార్ట్ 1 మూవీకి బాగానే కలెక్షన్ లభిస్తోంది. ఎన్టీఆర్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అక్కడి ఆడియన్స్ బాగానే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ డీటెయిల్స్ చూసుకుంటే 

ప్రీమియర్లు: 1054

  • 1వ రోజు: 1553
  • 2వ రోజు: 2327
  • 3వ రోజు: 1994
  • మొత్తం అడ్మిట్‌లు: 6928

అయితే దేవరకి దగ్గరగా కల్కి 2898 ఏడి, రంగస్థలం, సలార్ సినిమాలు కూడా దాదాపుగా 7000 అడ్మిట్స్ అందుకున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే దేవర కు అంత భారీగా కలెక్షన్ రానప్పటికీ ఒకింత బెటర్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ వీకెండ్ గడిచే సమయానికి అక్కడ రూ. 60 లక్షల మేర ఇండియన్ కలెక్షన్ అందుకుంది. మరి మొత్తంగా లాంగ్ రన్ లో దేవర ఎంతమేర రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version