Home సినిమా వార్తలు Coolie That Song will be Hilarious ‘కూలీ’ : ​ఆ సాంగ్ అదిరిపోనుందట

Coolie That Song will be Hilarious ‘కూలీ’ : ​ఆ సాంగ్ అదిరిపోనుందట

coolie

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న మాస్ గ్యాంగ్ స్టర్ భారీ యాక్షన్ డ్రామా సినిమా కూలీ. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతిహాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున తదితరులు కీలక రోల్స్ లో నటిస్తున్న కూలీ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. 

అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ టీజర్ కాని ఫస్ట్ సాంగ్ కానీ అందర్నీ ఆకట్టుకొని ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. త్వరలో ఈ మూవీ నుంచి మరొక అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 

విషయం ఏమిటంటే ఈ మూవీలో రజనీకాంత్ తో కలిసి పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఆమె అఫీషియల్ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ చేయగా అది ఏమాత్రం ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు.ఆమెకు సంబంధించి ఏదైనా ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేస్తారేమోనని అందరు భావించారు కానీ జస్ట్ ఆమె లుక్ యొక్క ఫోటో మాత్రమే రిలీజ్ చేసి సరిపెట్టారు మేకర్స్.

అయితే విషయం ఏమిటంటే, పూజా హెగ్డే చిందేయనున్న ఈ సాంగ్ ఓవరాల్ గా మూవీలో అదిరిపోతుందని, ముఖ్యంగా ఈ సాంగ్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా అందరికీ మంచి ఫీస్ట్ అందిస్తుందని త్నున్నారు. మరి ఓవరాల్ గా రిలీజ్ అనంతరం కూలీ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version