నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డాకు మహారాజ్. ఫస్ట్ డే మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, సచిన్ ఖేడేకర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.
Movie Colloboration
వాస్తవానికి అంతకముందు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ, తొలిసారిగా వాల్తేరు వీరయ్యతో పెద్ద విజయం అందుకున్న బాబీతో ఈ మూవీ చేయడంతో మొదటి నుండి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఈ మూవీకి మొదట బీజం పడింది.
అంతకముందు కొన్నాళ్లుగా తనకి ఇష్టమైన బాలకృష్ణ గారితో మూవీ చేయాలనీ భావిస్తున్న తనకు డాకు మహారాజ్ తో ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ చెప్పారు. ఇక గత మూడు బాలయ్య సినిమాలకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన ఎస్ థమన్, మరొక్కసారి డాకు మహారాజ్ తో తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ అలరించి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నారు.
Daaku Maharaj Initial Plans
వాస్తవానికి ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఇందులో ఒక కీలక పాత్ర చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి, అయితే సినిమా రిలీజ్ అనంతరం అది నిజం కాదని అర్ధమైంది. ఇక ఈ మూవీ 2023 జూన్ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గ్రాండ్ గా మొదలై ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. వాస్తవానికి మూవీని 2024 సమ్మర్ కానుకగా టార్గెట్ పెట్టుకుని మేకర్స్ రిలీజ్ చేద్దాం అని భావించారు అయితే కొన్నాయి అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ 2025 సంక్రాంతికి వెళ్ళింది.
Daaku Maharaj Pre Release Business and Buzz
ఇక డాకు మహారాజ్ కాంబో ఫై మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఉండడంతో దీని యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ముందుగా డాకు మహారాజ్ నుండి రిలీజ్ అయిన టీజర్ బాగా రెస్పాన్స్ అందుకోగా సాంగ్స్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకోలేదు. అనంతరం రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక డాకు మహారాజ్ మూవీ ఓవరాల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్ల మేర బిజినెస్ జరుపుకుని బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది.
Daaku Maharaaj Movie Review
ఇక ఈ మూవీ యొక్క రివ్యూ పరంగా చూస్తే ఓవరాల్ గా ఇది మంచి కమర్షియల్ మూవీ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ పెర్ఫార్మన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొన్ని టెరిఫిక్ షాట్స్ అలానే హై మూమెంట్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మూవీ బాలకృష్ణ కెరీర్ లో పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని అందరూ భావించారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆకట్టుకోదు. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కొన్ని హై యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ వీక్ విలన్ క్యారెక్టర్, సాదాసీదాగా ఉండే క్లైమాక్స్ వంటివి మూవీని సాధారణ విజయం వద్ద ఆపేసాయి.
Daaku Maharaaj Box Office Collection
ఇక ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా మొదటి రోజు సెకండ్ షోస్ బాగా ఫుల్ కావడంతో రెండవ రోజు నుండి మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని అందరూ భావించారు.
అయితే అంత అద్భుతంగా కాకపోయినా ఒకింత పర్వాలేదనిపంచేలా కలెక్షన్ అందుకున్న ఏ మూవీ ఓవరాల్ గా రూ. 100 కోట్ల షేర్ దాటుతుందని అనుకున్నారు. అయితే ఫైనల్ గా డాకు మహారాజ్ మాత్రం రూ. 80 కోట్ల వద్ద ఆగిపోయింది. మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం అదరగొడుతూ ఉండడం కూడా ఒక కారణం.
Daaku Maharaaj Roars In Netflix
ఇక డాకు మహారాజ్ మూవీ బాక్సాఫిస్ సక్సెస్ అనంతరం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక అన్ని భాషల ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ 2.4 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 13 దేశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ గ్లోబల్ గా ఐదవ పొజీషన్ లో నిలిచింది. అలానే ఇటు ఇండియాలో ఈ మూవీ నెంబర్ వన్ పొజీషన్ లో నిలిచింది.
Daaku Maharaaj Final Word: Nandhamuri Balakrishna Rises to Another Level
మొత్తంగా నటసింహం నందమూరి బాలకృష్ణ, బాబీ ల తొలి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ డాకు ,మహారాజ్ అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా బాలకృష్ణ సూపర్ పెరఫార్మన్స్ తో పాటు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో పాటు కొన్ని భారీ యాక్షన్, హై మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే క్లైమాక్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని రిలీజ్ డేట్ కూడా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా డాకు మహారాజ్ మరింతగా పెర్ఫార్మ్ చేసేదని చెప్పాలి.
మరి ఇంకా ఈ మూవీ చూడని వారు ఉంటె, వీలైతే నెట్ ఫ్లిక్స్ లో చూడండి, తప్పకుండా మిమ్మల్ని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.