Home సినిమా వార్తలు That OTT Company Silence on Daaku Maharaaj ‘​డాకు మహారాజ్’ ఓటిటి పై ఆ సంస్థ సైలెన్స్ ?

That OTT Company Silence on Daaku Maharaaj ‘​డాకు మహారాజ్’ ఓటిటి పై ఆ సంస్థ సైలెన్స్ ?

daaku maharaaj

​టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, శ్రద్ధ శ్రీనాథ్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్. 

బాబీ తెరకెక్కించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ దీనిని గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన డాకు మహారాజ్ బాగానే విజయం అందుకుంది. 

అయితే ఫస్ట్ డే బాగా టాక్ అందుకున్న డాకు మూవీ రాను రాను అంత భారీగా అయితే కలెక్షన్ అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి అయింది. ఇక మూవీ రిలీజ్ అయి దాదాపుగా నాలుగు వారాలు దగ్గర పడుతున్నప్పటికీ దీని యొక్క ఓటిటి హక్కులు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ వారి నుండి ఎటువంటి అప్ డేట్ అయితే లేదు. 

మరోవైపు అదే సమయంలో రిలీజ్ అయి డిజాస్టర్ అయిన గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటిటిలో రిలీజ్ అయింది. కాగా లేటెస్ట్ టాలీవుడ్  రాత్రి నుండి డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.  

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version