అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ విడాముయార్చి నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో అజిత్ సరసన హీరోయిన్ గా త్రిష కనిపించగా ఇతర కీలక పాత్రల్లో అర్జున్, రెజీనా, ఆరవ్, దాశరథి, నిఖిల్ నాయర్, రవి రాఘవేంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేశారు. యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దీనిని తెరకెక్కించారు.
అనిరుద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా సుభాస్కరన్ నిర్మించారు. అయితే ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విడాముయార్చి మూవీ సెకండ్ డే చాలా చోట్ల కలెక్షన్ డ్రాప్ అయింది.
ఇక ఫస్ట్ డే రూ. 50 కోట్లతో అజిత్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ ని రాబట్టింది ఈ మూవీ. కాగా సెకండ్ డే కేవలం రూ. 20 కోట్లని మాత్రమే వరల్డ్ వైడ్ రాబట్టింది. ఒకరకంగా అక్కడక్కడా పర్వాలేదనిపించే టాక్ సంపాదించినప్పటికీ అది కలెక్షన్ రాబట్టడంలో పెద్దగా హెల్ప్ అవడం లేదనేది మనకు సెకండ్ డే ఫిగర్స్ ని బట్టి అర్ధం అవుతుంది.
కాగా ఓవరాల్ గా రూ. 225 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటివరకు 30% శాతం మాత్రమే రికవర్ చేసింది. మరి ఈ వీకెండ్ లో విడాముయార్చి ఎంతవరకు పుంజుకుని ముందుకు సాగుతుందో చూడాలి.