Home సినిమా వార్తలు SSMB29 Official Announcement on That Day SSMB 29 : అఫీషియల్ అనౌన్స్ మెంట్...

SSMB29 Official Announcement on That Day SSMB 29 : అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఆ రోజున రానుందా ?

ssmb29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలని హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రికరిస్తోంది టీం. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్.నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక కీలకపాత్ర చేస్తుండగా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా మరొక ముఖ్యపాత్ర చేస్తున్నట్టు టాక్. 

నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరోవైపు అతిత్వరలో అనగా ఏప్రిల్ నెలలో సినిమాకి సంబంధించి కీలక షెడ్యూల్ కెన్యా, సౌతాఫ్రికా, బల్గేరియా వంటి దేశాల్లో గ్రాండ్ గా చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారట మూవీ టీం. అయితే విషయం ఏమిటంటే ఈ లోపు గానే సినిమా యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ ని అలానే ప్రెస్ మీట్ ని నిర్వహించేందుకు జక్కన్న అండ్ టీమ్ సిద్ధమవుతున్నారని లేటెస్ట్ బజ్. 

కాగా మార్చి 30న ఉగాది రోజున ఆ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందట. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు తమ ముందుకి వస్తుందా ఎదురు చూస్తున్నారు. మరి ఇంతకీ SSMB 29 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో పక్కాగా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version