Home సినిమా వార్తలు Pooja Hegde Acting in Challenging Role ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్న పూజా హెగ్డే 

Pooja Hegde Acting in Challenging Role ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్న పూజా హెగ్డే 

pooja hegde

టాలీవుడ్ అందాల కథానాయికల్లో ఒకరైన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా పలు సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు. ఓవపు తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీ సినిమాలను ఆమె చేస్తున్నారు. 

ఇక తాజాగా ఆమె చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ లవ్ యాక్షన్ డ్రామా మూవీ రెట్రో కాగా మరొకటి లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచన 4. అలానే వీటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న మాస్ మూవీలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ అయితే చేయనున్నారు. 

ఈ సినిమాలన్నిటి పై కూడా పూజాహెగ్డే అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాగా వీటిలో లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచన 4 హారర్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరక్కుతోంది. కాంచన సిరీస్ లోని నాలుగో సినిమా అయిన ఈ మూవీలో పూజాహెగ్డే చెవిటి మరియు మూగ అమ్మాయిగా ఒక గ్రామీణ యువతీ పాత్రలో కనిపించనున్నారట. 

ఈ పాత్ర ఆమెకు కెరీర్ పరంగా ఎంతో చాలెంజింగ్ అని, కాగా ఆమె ఈ పాత్రలో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ మూవీని గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో లారెన్స్, పూజా హెగ్డే తో పాటు నోరా ఫతేహి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version