Home సినిమా వార్తలు Naga Chaitanya with an Interesting Movie Lineup ఇంట్రెస్టింగ్ మూవీస్ లైనప్ తో నాగ...

Naga Chaitanya with an Interesting Movie Lineup ఇంట్రెస్టింగ్ మూవీస్ లైనప్ తో నాగ చైతన్య

naga chaitanya

తాజాగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ ద్వారా పెద్ద విజయం సొంతం చేసుకున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించగా గీతా ఆర్ట్స్ సంస్థ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించారు. 

అందరిలో మంచి అంచనాలుఎ ఏర్పరిచిన తండేల్ మూవీ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ సొంతము చేసుకుంది. చందూ మొండేటి ఆకట్టుకునే టేకింగ్, చైతన్య మరియు సాయి పల్లవిల సూపర్ పెర్ఫార్మన్స్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీని పెద్ద సక్సెస్ చేసాయి. రూ. 100 కోట్ల గ్రాస్ కి చేరువవుతోన్న ఈ మూవీ అనంతరం నాగచైతన్య కెరీర్ లైనప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. 

ముందుగా దీని తరువాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు తో ఒక మిస్టిక్ థ్రిల్లింగ్ మూవీ చేయనున్నారు. అనంతరం బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వర్క్స్ వారు గ్రాండ్ గా నిర్మించనున్న హర్రర్ కామెడీ చేస్తారు. వీటి రెండిటి అనంతరం చందూ మొండేటితో హిస్టారికల్ మూవీ తెనాలి రామకృష్ణ చేయనున్నారు. మొత్తంగా ఈ మూడు సినిమాలు విజయవంతం అయితే నటుడిగా నాగచైతన్య రేంజ్, మార్కెట్ వేల్యూ మరింతగా పెరగడం ఖాయం 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version