Home సినిమా వార్తలు Sai Abhyankkar New Music Sensation సాయి అభ్యంకర్ : న్యూ మ్యూజిక్ సెన్సేషన్ 

Sai Abhyankkar New Music Sensation సాయి అభ్యంకర్ : న్యూ మ్యూజిక్ సెన్సేషన్ 

sai abhyankar

తాజాగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొత్తగా వినిపిస్తున్న పేరు సాయి అభ్యంకర్. ఇటీవల వరుసగా ఇండిపెండెంట్ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, క్రేజ్ సంపాదించాడు సాయి అభ్యంకర్. ముఖ్యంగా ఆసా కూడా మరియు కట్చి సెరా సాంగ్స్ తో మంచి చార్ట్‌బస్టర్‌లు అందుకున్నాడు. ఇటీవల మీనాక్షి చౌదరి నటించిన తన కొత్త పాట సితిర పుతిరను ద్వారా కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ఆ విధంగా నిస్సందేహంగా అతడు కోలీవుడ్ కొత్త సంగీత సంచలనంగా  మారాడు. కాగా ప్రస్తుతం అతడికి మంచి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందనున్న సూర్య 45వ మూవీకి సాయి అభ్యంకర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు. 

అలానే లేటెస్ట్ సినీ వర్గాల న్యూస్ ప్రకారం అతి త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యువ దర్శకుడు అట్లీల క్రేజ్ కాంబినేషన్ మూవీకి కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్ అని అంటున్నారు. ముందుగా ఆ మూవీకి అనిరుద్ రవిచందర్ ని అనుకున్నారట. కాగా కొన్ని కారణాల రీత్యా అనిరుద్ స్థానంలోకి సాయి వచ్చాడని, త్వరలో ఈ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version