Home సినిమా వార్తలు Akkineni Nagarjuna Interesting Comments on Pushpa 2 ‘పుష్ప 2’ పై నాగార్జున ఇంట్రెస్టింగ్...

Akkineni Nagarjuna Interesting Comments on Pushpa 2 ‘పుష్ప 2’ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

nagarjuna

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 గత ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి ఎంత పెద్ద బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించిందో మనకు అందరికీ తెల్సిందే. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించగా సుకుమార్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కించారు. 

పుష్ప 2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి దేశంలోని అన్ని భాషల ఆడియన్స్ నుండి విశేషమైన రెస్పాన్స్ లభించడంతో పాటు ఈ మూవీ ఓవరాల్ గా రూ. 1670 కోట్లు కొల్లగొట్టింది. 

ఇక ఈ మూవీ పై కొందరు అక్కడక్కడా విమర్శలు చేసినప్పటికీ మెజారిటీ ఆడియన్స్ అలానే సెలబ్రిటీలు మాత్రం మూవీ గురించి మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ గురించి పలు సందర్భాల్లో పొగుడుతూనే ఉన్నారు. 

అయితే విషయం ఏమిటంటే, తాజాగా జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించే సినిమాలోని కంటెంట్ యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన వివరించారు. 

ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయాలు సొంతం చేసుకున్న  పుష్ప 2, ఆర్ఆర్ఆర్ మరియు కాంతార సినిమాలను ప్రధాన ఉదాహరణలుగా పేర్కొంటూ, స్థానికత అంశాన్ని జోడించి అద్భుతంగా కథ చెప్పడం మరియు సాంస్కృతిక ప్రామాణికత ద్వారా ఒక సినిమా దేశవ్యాప్తంగా విజయంలో ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఆయన హైలైట్ చేశారు. 

పుష్ప మరియు పుష్ప2 గురించి నాగార్జున తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పుష్పరాజ్‌ను ఒక ఐకానిక్ సూపర్ హీరో పాత్ర అని పిలిచారు, ఇది ఆ పాత్ర యొక్క మీమ్స్ మరియు స్పూఫ్‌ల ద్వారా సోషల్ మీడియా సంచలనంగా మార్చింది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ తో పాటు సినిమాలో కథ కథనాలు ఆకట్టుకోవడంతోనే అంత పెద్ద విజయం అందుకుందని అన్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version