టాలీవుడ్ యువ నటుడు నితిన్ ఇటీవల వక్కంతం వంశీ తెరకెక్కించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ ఆడియన్స్ ని అర్చనలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీతో పాటు వెంకీ కుడుముల తో రాబిన్ హుడ్ మూవీస్ చేస్తున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజక్ట్స్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా వీటిలో ముందుగా రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అందాల యువ కథానాయిక శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక తమ్ముడు మూవీలో లయ ఒక కీలక పాత్ర చేస్తుండగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని మే 9న రిలీజ్ చేయనున్నారు. మ్యాటర్ ఏమిటంటే, రాబిన్ హుడ్ రిలీజ్ రోజైన మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అలానే తమ్ముడు రిలీజ్ రోజైన మే 9న మెగాస్టార్ విశ్వంభర ని రిలీజ్ చేయనున్నట్లు ఆ రెండు సినిమాల మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఈ విధంగా మెగా బ్రదర్స్ ఇద్దరి రిలీజ్ డేట్స్ ని నితిన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది కావాలని టార్గెట్ చేసింది కాదని, రాబోయే రోజుల్లో ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నాయి సినీ వర్గాలు.