టాలీవుడ్ యువ నటుడు నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
గతంలో వెంకీ, నితిన్ కలిసి చేసిన బీష్మ మూవీ సక్సెస్ సాధించడంతో రాబిన్ హుడ్ పై అందరిలో బాగా అంచనాలు ఏర్పడ్డాయి. అలానే ఇటీవల రాబిన్ హుడ్ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని అంచనాలు మరింతగా పెంచేసాయి.
కాగా ఈ మూవీ నుండి వేర్ ఎవర్ యు గో అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ని రేపు సాయంత్రం 6 గం. 3 ని. లకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారని టీం కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించింది.
ఈ మూవీలో నితిన్ ఒక దొంగ పాత్రలో కనిపించనుండగా ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ అంశాలు తమ మూవీలో ఆకట్టుకుంటాయని రాబిన్ హుడ్ టీమ్ అంటోంది. అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.