Home సినిమా వార్తలు ​RGV Shocking Comments on Rajinikanth రజినీకాంత్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ 

​RGV Shocking Comments on Rajinikanth రజినీకాంత్ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ 

rgv rajinikanth

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా ఏ పని చేసినా ఒకింత సంచలనం  అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో పలు అద్భుతమైన సినిమాలు చేసిన వర్మ. అటు బాలీవుడ్ లో కూడా దర్శకుడిగా మంచి క్రేజ్ ని సక్సెస్ లని సొంతం చేసుకున్నారు. 

అయితే ఇటీవల కొన్నేళ్లుగా వర్మ తీస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సత్య మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఒకింత ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసిన వర్మ, ఇకపై మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. 

అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం స్లో మోషన్ సీన్స్ వల్లనే ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించారని కామెంట్ చేశారు. 

కాగా వర్మ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం కోలీవుడ్ తో పాటు అన్ని భాషల్లోని తలైవా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఆయన పై విమర్శలు చేస్తున్నారు. నిజానికి తన మార్క్ క్రేజ్, స్టైల్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ తో మొదటి నుండి తనకంటూ ప్రత్యేకత సంతరించుకుని అన్ని వర్గాలు అనేక దేశాల ఆడియన్స్ లో ఎంతో గొప్ప పేరు అందుకున్నారు రజినీకాంత్. 

అటువంటి సూపర్ స్టార్ ని వర్మ ఈ విధంగా టార్గెట్ చేస్తూ వర్మ నెగటివ్ కామెంట్స్ చేయడం సమంజసం కాదని అంటున్నారు పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్. మరి వర్మ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version