టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నటుడిగా కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో సినిమాతో కష్టపడి పైకి ఎదిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ల తరువాత వచ్చిన నలుగురు నటుల్లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని సక్సెస్ లు అలానే ఎంతో క్రేజ్ తో నెంబర్ వన్ గా దూసుకెళ్ళారు.
ఆ తరువాత తరం వచ్చినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు మనసులోనూ గొప్ప వ్యక్తే అనేది గతంలో కూడా పలు సంఘటనలతో రుజువయింది.
తన కెరీర్ లో పలువురు నటులకి సాయం అందించిన మెగాస్టార్ తాజాగా యువనటి ఊర్వశి రౌటేలా తల్లికి కూడా సాయం అందించారు. తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఊర్వశి మాట్లాడుతూ, తన తల్లికి ఇటీవల కొన్నాళ్లుగా అనారోగ్యం కారణంగా కోల్కతా లోని ఒక ఆసుపత్రిలో చేర్పించామన్నారు.
అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదని, అదే సమయంలో మెగాస్టార్ ని సాయం కోరగా ఆయన మంచి మనసుతో ఆ ఆసుపత్రి వారితో మాట్లాడి తన తల్లికి వైద్యం చేయించారని అన్నారు. అలానే తరచు తన తల్లి ఆరోగ్యం గురించి ఆయన వాకబు చేస్తూనే ఉన్నారని, ఆ విధంగా అయన రీల్ పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా మెగాస్టారే అని ఆమె కామెంట్ చేసారు.