Home సినిమా వార్తలు 30 years of Prudhvi Finally Apologizes ​ఫైనల్ గా క్షమాపణలు చెప్పిన 30 ఇయర్స్...

30 years of Prudhvi Finally Apologizes ​ఫైనల్ గా క్షమాపణలు చెప్పిన 30 ఇయర్స్ పృథ్వీ 

prudhvi raj

​టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కమెడియన్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న నటుల్లో 30 ఇయర్స్ పృథ్వీ ఒకరు. అలానే సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక కామెడీ స్టైల్ ని కలిగి ఉన్న పృథ్వీ ఇటీవల వైసిపి నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 

అప్పటి నుండి ఆ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న పృథ్వీ తాజాగా ఒక ఈవెంట్ లో వైసిపి పార్టీ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. విషయంలోకి వెళ్తే విశ్వక్సేన్ హీరోగా లైలా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్ గా జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఈ వేడుకలో 150 మరియు 11 మేకలు అంటూ పృథ్వీ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వైసిపి వారి నుండి వ్యతిరేకత వ్యక్త,మైంది. దానితో పలువురు ఆ పార్టీ వారు పృథ్వీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అనంతరం తనకు పలు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో అనార్యోగం కారణంగా ఆసుపత్రిలో చేరిన పృథ్వీ తాజాగా ఆ ఘటన పై ఫైనల్ గా క్షమాపణలు చెప్పారు. 

నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను. బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి. అలానే  ​ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి, యువ నటుడు విశ్వక్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఒక వీడియో బైట్ ద్వారా తెలిపారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version