యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఇటీవల మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రఫికల్ యాక్షన్ మూవీ అమరన్. ఈ మూవీని యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ముఖ్యంగా శివకార్తికేయన్, సాయి పల్లవి ల యాక్టింగ్ తో పాటు పలు యాక్షన్ ఎమోషనల్ అంశాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక అనంతరం ఓటిటిలోకి వచ్చిన అమరన్ అక్కడ కూడా బాగా వ్యూస్ సొంతం చేసుకుంది.
అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా టెలివిజన్ ఆడియన్స్ ముందుకి వచ్చిన అమరన్ మూవీ ఎవరూ ఊహించని రేంజ్ లో తెలుగు ఆడియన్స్ మన్ననలు అందుకుంది. ఈ మూవీ అర్బన్‌లో 9.19 రేటింగ్ మరియు అర్బన్ మరియు రూరల్‌లో 8 టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. డైరెక్ట్ తెలుసు మూవీస్ మాదిరిగా ఈ స్థాయి రేటింగ్ రావడం షాకింగ్ అని అంటున్నాయి సినీ వర్గాలు తెలుగు ఆడియన్స్ తమ మూవీకి అందించిన ఈ ఆదరణకు అమరన్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.