Home సినిమా వార్తలు ​Balakrishna Gifts Porsche Car to Thaman థమన్ కు భారీ కార్ గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ 

​Balakrishna Gifts Porsche Car to Thaman థమన్ కు భారీ కార్ గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ 

thaman

యువ సంగీత తరంగం ఎస్ థమన్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మూవీస్ కి థమన్ అందించిన సంగీతానికి మంచి పేరు లభించింది. ముఖ్యంగా డాకు మహారాజ్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మరింత క్రేజ్ దక్కింది. 

అంతకముందు బాలకృష్ణ తో తమన్ చేసిన అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలకి కూడా థమన్ అందించిన సాంగ్స్, తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోవడంతో పాటు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. 

అలానే మొదటి నుండి బాలకృష్ణ తో మూవీ అంటే తనకు ప్రత్యేకంగా అనిపిస్తుందని, ముఖ్యంగా అఖండ మూవీకి తాను కొట్టిన మ్యూజిక్ అందుకే అంత బాగా క్రేజ్ అందుకుందని అంటారు థమన్. అలానే బాలకృష్ణ ని తన తండ్రి మాదిరిగా భావిస్తానని ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా థమన్ మాట్లాడుతూ చెప్పారు. 

విషయం ఏమిటంటే నేడు థమన్ కు భారీ పోర్షె కార్ ని ప్రత్యేకంగా బహుకరించారు నందమూరి బాలకృష్ణ. కాగా దీని విలువ కోటిన్నరకు పైగా ఉంటుందట. దానికి సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేడు థమన్ కు కార్ బహుకరించడంతో మరొకసారి తన మంచి మనసుని బాలకృష్ణ చాటుకున్నారని పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version